యోగా చేస్తూ రేవంత్ ప్రచారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని హెచ్ఎంటీ గ్రౌండ్స్ వద్ద ప్రచారాన్ని నిర్వహించారు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి. అత్యంత తక్కువ శాతం పోలింగ్ నమోదయ్యే కేంద్రం మల్కాజిగిరి అని... ఎన్నికల సమయంలో సెలవులున్నాయని ఊరు వెళ్లి ఓటు వేయడం మర్చిపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మరో పదిమందితో ఓటు వేయించేలా చొరవ తీసుకోవాలని కోరారు. హెచ్ఎంటీ మైదానంలో యువతతో కలిసి క్రికెట్ ఆడి... యోగా కేంద్రంలో ధ్యానం చేశారు. తనను ఎంపీగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. గెలిచిన వెంటనే నియోజకవర్గంలో సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:'నా గెలుపు ప్రభుత్వానికి చెంప పెట్టు'