ETV Bharat / state

ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

గుట్టుచప్పుడు కాకుండా రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న నలుగురు నిందితులను మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. అక్కడే ఉన్న ఆటోల్లో పరారైన మరో పది మంది నిందితుల కోసం గాలిస్తున్నారు.

ration rice seized in medchal district while transporting to other states
మేడ్చల్ జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత
author img

By

Published : Sep 8, 2020, 3:58 PM IST

మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని లీజెండ్ వెంచర్, వెంకటేశ్వర కాంట వద్ద ఉన్న గోడౌన్​లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తోన్న నలుగురు నిందితులను దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. 3 టాటాఏస్​ వాహనాల్లో ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నగరంలోని ముషీరాబాద్​ ప్రాంతానికి చెందిన రహీముద్దీన్, మరికొంత మందితో కలిసి కుత్బుల్లాపూర్​లోని రేషన్ దుకాణాల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసేవాడు. వాటిని దుండిగల్​లోని ఓ గోడౌన్​లో నిల్వ ఉంచి, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే సమాచారంతో.. రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో లోడ్​తో ఉన్న 3 టాటాఏస్​ వాహనాలు, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఉన్న ఆటోల్లో పరారైన మరో పది మంది నిందితుల కోసం గాలిస్తున్నట్లు దుండిగల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.