ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం అడ్డదారుల్లో బ్లాక్ మార్కెట్‌కు తరలి వెళ్తోంది. తాజాగా బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న నలుగురిని జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 60 క్వింటాళ్ల బియాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఎలా దొరికిపోయారు..
జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో రాంరెడ్డినగర్‌లోని ఓ గోదాంలో సుమారు 60 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా నిల్వచేశారు. అర్ధరాత్రి సమయంలో జహీరాబాద్ తరలించేందుకు టాటా ఏసీ వాహనం సిద్ధం చేశారు. ఇంటి వద్దకు రావాలని వాహన డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు. డ్రైవర్‌కు అడ్రస్ తెలియక గోదాంకు ఎదురుగా ఉన్న కంపెనీలోకి వెళ్లాడు. దొంగల వచ్చారనుకున్న సదరు కంపెనీ భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. సురేష్ అనే వ్యక్తి కిరాయి కోసం వాహనం తీసుకురమ్మని చెప్పినట్లు పోలీసుల ఎదుట డ్రైవర్ అంగీకరించాడు.
ఇవీచూడండి: కరోనా లేని రాష్ట్రంగా మారుస్తాం: ఈటల