మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ వెంకటేశ్వర కాలనీలో భాజపా ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. చిన్నపాటి వర్షానికే బురదమయమైన రహదారిపై వరి నాట్లు వేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వానికి ఇది నిదర్శనమని నాయకులు ప్రసాద్ గౌడ్, నటరాజ్ మండిపడ్డారు.
చిన్నపాటి వర్షం పడితే చాలు.. కాలనీ ప్రధాన రహదారి మొత్తం బురద మయంగా తయారవుతోందని నాయకులు ఆరోపించారు. బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. కాలనీలోని రహదారులను బాగుచేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో మరోసారి సీరం సర్వే