పోలీసు అధికారులు, సిబ్బంది దేహదారుఢ్యాన్నిపెంపొందించుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. క్రీడలు ఇందుకు దోహదపడతాయని ఆయన అన్నారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టును మహేశ్ భగవత్ ప్రారంభించారు.
అధికారులు, సిబ్బంది అందరూ టెన్నిస్ కోర్ట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీపీ కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ కొద్దిసేపు టెన్నిస్ ఆడారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి తదితరులు పాల్గొన్నారు.