మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరిలోని ఈస్ట్ ఆనంద్ బాగ్లో నిర్మిస్తున్న రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. లాక్డౌన్ సమయాన్ని ఉపయోగించుకుని పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.
మొదట్లో భూసేకరణకు ఇబ్బంది ఉండేదని.. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కృషితో సమస్య పరిష్కారమైందన్నారు. జూన్ నెలాఖరు వరకు ఒక లైన్ అందుబాటులోకి వస్తుందని.. జులై నెలాఖరు వరకు మొత్తం ఆర్యూబీ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.