మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో మున్సిపల్ అధికారులకు 100 వ్యక్తిగత రక్షణ సామగ్రి కిట్లను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అందజేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లోనూ అనునిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న మున్సిపల్ సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు.
కొవిడ్‌తో జరుగుతున్న పోరాటంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందిని సురక్షింతంగా ఉంచాల్సిన భాద్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే సూచించారు.