ETV Bharat / state

రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2,743 మందిపై కేసులు

హైదరాబాద్​ నగర పోలీసులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు జప్తు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్​డౌన్ ఆంక్షలు అతిక్రమించిన వారిపై 2743 కేసులు నమోదు చేశారు.

police registered lock down cases
లాక్​ డౌన్​ ఉల్లంఘించిన వారిపై కేసులు
author img

By

Published : May 25, 2021, 7:25 AM IST

హైదరాబాద్​లోని మూడు కమిషనరేట్ల పరిధుల్లో నిబంధనలు అతిక్రమించిన వారిపై వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఒక్క రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే లాక్​డౌన్ ఉల్లంఘించిన 2743 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.

దీంతో పాటు మాస్క్ ధరించని 668 మంది, సామాజిక దూరం పాటించని 58 మంది, గుంపులుగా తిరుగుతున్న 39 మంది, బహిరంగ ప్రదేశాల్లో గూట్కా నమిలిన 24 మందిపై కేసులు నమోదు చేశారు. ఆంక్షల సమయంలో బయటకు వచ్చిన 282 వాహనాలు జప్తు చేసి కేసులు నమోదు చేశారు. నిన్న ఉదయం నుంచి గత రాత్రి 8గంటల వరకే ఈ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.

ఇదీ చూడండి: ఈ-పాస్ ఉండాల్సిందే.. లేకుంటే అనుమతించం: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.