కూకట్పల్లిలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. శాతవాహన కాలనీ ఉమామహేశ్వర ఆలయం, కేపీహెచ్బీ రోడ్ నంబర్ మూడులోని కామాక్షి సమేత ఆలయాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
శివరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. శివలింగాలకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో ఆలయాలు సందడిగా మారాయి.
ఇదీ చూడండి : బాధితులకు సాయం లేదు.. నిందితులకు ఉరిశిక్షలేదు...