ETV Bharat / state

మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డిని కలిసిన కూకట్​పల్లి ప్రజా ప్రతినిధులు - Telangana latest news

Kukatpally constituency problems: అల్ప ఆదాయ వర్గాలకు సంబంధించి.. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్​ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డిని కలిసి నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులను మొదలు పెట్టాలని వినతి పత్రం ఇచ్చారు.​

Madhavaram Krishna Rao meet Vemula Prashant Reddy

author img

By

Published : Dec 18, 2022, 3:16 PM IST

Updated : Dec 18, 2022, 4:25 PM IST

Kukatpally constituency problems: కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్​ కుమార్​.. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో అల్ప ఆదాయ వర్గాలకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలని వారు మంత్రికి వినతి పత్రం అందజేశారు. అలాగే నియోజక వర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కేపీహెచ్​బీ డివిజన్​లో సాయి నగర్​ కాలనీ రెగ్యులరైజ్​, రమ్య గ్రౌండ్​ను జిల్లా పరిషత్​ స్కూల్​కు కేటాయించేటట్లు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

నియోజక వర్గంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించడానికి వీలుగా స్థలాన్ని కేటాయించావల్సిందిగా మంత్రిని కోరారు. 9 ఫేజ్​లో ఉన్న రెండున్నర ఎకరాలను పార్కుకు కేటాయించాల్సిందిగా వినతి పత్రంలో పేర్కొన్నారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి వేముల.. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్​ ద్వారా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 18, 2022, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.