పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కూకట్ పల్లి జయనగర్ కాలనీలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన రోడ్లు, కాలనీ రహదారులపై పేరుకున్న చెత్తాచెదారాన్ని తొలగించారు. ఇళ్లలో వెలువడే చెత్తాచెదారాన్ని జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఆటోల వారికి మాత్రమే ఇవ్వాలని అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్ సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో కూడా ఖాళీ ప్రదేశంలో వేయకూడదన్నారు.
చిన్నపిల్లలకు పారిశుద్ధ్యం, హరితహారంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తన మనవడితో మొక్కలు నాటించారు.