మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష నేడు సాయంత్రం వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఆ గ్రామంలోనే బస చేశారు. మూడుచింతలపల్లి దళితవాడలోని బూరుగు సాయిలు (ఇందిరమ్మ) ఇంట్లో రేవంత్‌రెడ్డి రాత్రి బస చేశారు. కేసీఆర్ దత్తత గ్రామంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు. మూడు చింతలపల్లిలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారో ఇంటింటికీ తిరుగుదాం వస్తారా అంటూ తెరాస నేతలను నిలదీశారు.
ఇదీ చదవండి: Revanth Reddy: 'నీళ్లేమో జగన్‌రెడ్డి తీసుకపాయే.. నిధులేమో కేసీఆర్ ఇంట్లోకి చేరె'