మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కండ్ల కోయ ఆక్సిజన్ పార్కును పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సందర్శించారు. ఆక్సిజన్ పార్కులోని ఎకరం భూమిలో దట్టమైన అడవిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్కులో ఉన్న వివిధ రకాల మొక్కలను వారు పరిశీలించారు.
అర్బన్ పార్కులను యాదాద్రి మోడల్ పార్కుల మాదిరిగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆయనతోపాటు మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉన్నారు.