ETV Bharat / state

ప్రైవేట్​ స్కూల్​కు దీటుగా ప్రభుత్వ పాఠశాల

మేడ్చల్​ జిల్లా దుండిగల్​లోని జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల రంగుల లోకంగా మారింది. లాక్​డౌన్​లో పాఠశాల ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంస్థ సహకారంతో రంగులు వేయించారు.

school
ప్రభుత్వ పాఠశాల
author img

By

Published : Jun 24, 2021, 4:58 AM IST

సర్కార్​ బడి అంటే పాతబడిన గదులు, విరిగిపోయిన బెంచీలు, వాసనొచ్చే మరుగుదొడ్లు, అపరిశుభ్రమైన పరిసరాలు దర్శనమిస్తాయి. కాని ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే అలా అనిపించదు. ఎదో ప్రైవేట్​ స్కూల్​లోకి వెళ్లినట్లు అనిపిస్తుంది. అదే మేడ్చల్​ జిల్లా దుండిగల్​లోని జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల... ఈ స్కూల్​ను అందంగా మార్చింది ఆ పాఠశాల గురువులే.. లాక్​డౌన్​లో ఉపాధ్యాయులు ఖాళీగా ఉండకుండా మళ్లీ పిల్లలు స్కూల్​కు వచ్చేలోగా చక్కటి రంగల లోకంగా తీర్చిదిద్దాలని అనుకున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కలిసి పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు.

school
ప్రభుత్వ పాఠశాల

స్వాగత ద్వారం నుంచి లోపలి వరకు ప్రతి చోట పిల్లలకు అవగాహన కలిగేలా సబ్జెక్టులను పెయింటింగ్​ రూపంలో వేశారు. సైన్స్, మాథ్స్, కంప్యూటర్స్, చెట్ల పెంపకం, నీటి పొదుపు, కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చక్కటి పెయింటింగ్​ వేశారు. పాఠశాల చుట్టూ హరితహారంలో భాగంగా చెట్లను పెంచుతున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు తమను ఆదర్శంగా తీసుకునేలా పిల్లలకు కంప్యూటర్ ల్యాబ్స్, చక్కటి ఆడిటోరియం ఏర్పాటు చేశామని ప్రిన్సిపల్​ తెలిపారు.

school
ప్రభుత్వ పాఠశాల

ఇదీ చదవండి: 'తెలుగువారికి ఉపకారం చేయాలని ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.