మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని చెంగిచర్ల చింతల చెరువు బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులు జారీ చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల సంరక్షణకు ఓవైపు ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా.. అక్రమ నిర్మాణాలకు నగర పాలక సంస్థ అనుమతులు జారీ చేస్తోందని ఆరోపిస్తున్నారు. కాసారం ఆలుగు దిగువన భారీ నిర్మాణానికి ఓ వ్యక్తి అనుమతులు తీసుకున్నారని చెప్పారు.
మొదట ఇరిగేషన్ అధికారులు ఎన్‌వోసీ జారీ చేశారని అన్నారు. మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు. కేవలం 50 చదరపు అడుగులు మాత్రమే బఫర్ జోన్ ఉందంటూ రెవెన్యూ అధికారులు పేర్కొనడం గమనార్హమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కమిషనర్ శ్రీనివాస్‌ను 'ఈటీవీ భారత్' వివరణ కోరగా... అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామని తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్‌కు కాంగ్రెస్ నాయకులు కొత్త ప్రభాకర్‌గౌడ్, మాజీ వార్డు సభ్యులు కుర్రి శివశంకర్ వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి: శ్రమ జీవుల చెమట చుక్కలతోనే అభివృద్ధి సాధ్యం: సీఎం కేసీఆర్