వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పాతవిధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. ధరణి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం భావించింది.
ఆధార్‌తోపాటు ఆన్‌లైన్ విధానాన్ని సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. కేసు తేలేవరకు పాతపద్ధతిలోరిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. ఆధార్ అడగవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిణామాల అనంతరం ముఖ్యమంత్రి నిర్ణయంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మేడ్చల్ జిల్లా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్లు చేయించడానికి డాక్యుమెంట్ రైటర్‌లు సిద్ధంగా ఉన్నారు.
- ఇదీ చదవండి: 'జనవరిలోనే కరోనా వ్యాక్సిన్'