ETV Bharat / state

రూ.18వేలకు 2నెలల బాబును అమ్మేసిన తండ్రి - బాబు విక్రయం

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కర్కోటకుడిగా మారాడు. తల్లి పొత్తిళ్లో హాయిగా నిద్రపోతున్న పసివాడిని ఎత్తుకెళ్లి అమ్మేశాడు. బాబును కొనుగోలు చేసి వరంగల్‌కు తీసుకెళ్తున్న వ్యక్తులను జీడిమెట్ల పోలీసులు పట్టుకున్నారు.

new-born-boy-sale-in-medchal
మాయమాటలకు తలొగ్గి... కొడుకునే అమ్మేశాడు...
author img

By

Published : May 24, 2020, 12:57 PM IST

Updated : May 24, 2020, 4:28 PM IST

మేడ్చల్‌ జిల్లా గాజులారామరంలోని బతుకమ్మబండ బస్తీకి చెందిన సరిత, సింగ్‌ దంపతులకు ఇద్దరు సంతానం. శేషు అనే మహిళ మాయమాటలకు తలొగ్గిన సింగ్‌... రెండు నెలల బాబును 18వేలకు విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. మహేశ్, యాదమ్మ అనే మరో ఇద్దరితో కలిసి బాబును అమ్మేందుకు సన్నాహాలు చేశాడు.

''నా భర్త నాకు తెలియకుండా బాబును అమ్మేశాడు. శేషు, మహేశ్, యాదమ్మ మా ఇంటికి వస్తూ ఉండేవారు. కానీ వాళ్లు ఇలా చేస్తారనుకోలేదు. ఈ రోజు ఉదయం లేచి చూసే సరికి బాబు కనిపించలేదు. నాలుగు గంటలకే నన్ను వరంగల్​కు వెళ్దామని తీసుకెళ్లేందుకు నా భర్త ప్రయత్నించాడు.''

-సరిత, పసికందు తల్లి

ఈ క్రమంలో తెల్లవారుజామునే శిశువును బ్యాగ్​లో వేసుకుని అక్కడి నుంచి శేషు పరారైంది. బిడ్డలేక రోదిస్తున్న తల్లిని చూసిన స్థానికులు విషయం తెలుసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగాకేసు నమోదు చేసుకున్నారు.

''నాకు ఉదయం 5 గంటలకు సమాచారం తెలిసింది. వెంటనే వచ్చి అడగ్గా... వారి సమాధానాలపై అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారు వచ్చి జీడిమెట్ల వద్ద బాబును ఎత్తుకెళ్లిన వారిని పట్టుకున్నారు. ఈ మహేశ్, యాదమ్మ గతంలో కూడా చాలా నేరాలు చేశారు. ''

-రమేశ్, స్థానికుడు

రూ.18వేలకు 2నెలల బాబును అమ్మేసిన తండ్రి

శిశువును వరంగల్‌కు తరలిస్తున్న మహేశ్​ను సికింద్రాబాద్‌లో పట్టుకొని జీడిమెట్ల పోలీస్​స్టేషన్​కు తరలించారు. బాబు తల్లిదండ్రులతో పాటు నిందితులను విచారిస్తున్నారు. అయితే బాబు కావాలని కోరిన వరంగల్‌కు చెందిన దేవి కోసం పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి: 'జురాసిక్ వరల్డ్​'లో కోహ్లీ.. టీజర్ విడుదల!

Last Updated : May 24, 2020, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.