మేడ్చల్ జిల్లా నేరెడ్మెట్ పరిధిలోని దీనదయాళ్ నగర్లో ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందిన సుమేధ ఘటనలో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ, ఇంజినీరింగ్ అధికారులపై కేసు నమోదు చేయనున్నట్టు నేరెడ్మెట్ సీఐ లక్ష్మీ నరసింహస్వామి తెలిపారు. బాలిక మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ.. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఈ, డీఈలపై 170, 40, 304 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని.. ఉన్నతాధికారులతో చర్చించి చర్యలకు సిద్ధమవుతామని సీఐ తెలిపారు.
సుమేధ ఘటనలో అధికారులపై కేసు నమోదు - నేరెడ్మెట్ నాలాలో పడి బాలిక మృతి
మేడ్చల్ జిల్లా నేరెడ్మెట్లోని దీనదయాళ్ నగర్లో నాలాలో పడి మృతి చెందిన చిన్నారి సుమేధ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ, ఇంజినీరింగ్ అధికారుల మీద కేసు నమోదు చేయనున్నట్టు నేరెడ్మెట్ సీఐ లక్ష్మీ నరసింహస్వామి తెలిపారు.