మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజ్ భార్య స్వప్న న్యాయం కోసం రాష్ట్రం మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. తన భర్త నాగరాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని... అతన్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఆమె హెచ్ఆర్సీకి వివరించింది. జైల్ సిబ్బందిపై తనకు అనుమానం ఉందని... రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని ఆమె పేర్కొన్నారు.
కేసును ఇక్కడితో వదిలేయాలని.. తనని పోలీసులు బెదిరిస్తున్నారని స్వప్న అన్నారు. తనకు ప్రాణహాని ఉందని... రక్షణ కల్పించి హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తానని ఆమె తెలిపారు. దోషులకు శిక్ష పడేంతవరకు పోరాటం చేస్తానని స్వప్న స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్.. రూ. 45 లక్షలు డిమాండ్!