మేడ్చల్ జిల్లా ఉప్పల్, రామంతాపూర్‌లో ఎంపీ రేవంత్‌రెడ్డి(Revanth Reddy), ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ రజిత పరమేశ్వర్‌రెడ్డితో కలిసి
పర్యటించారు. హరిజనబస్తీలో రూ.22.50 లక్షలతో నిర్మిస్తున్న మహిళ భవనం, ఇందిరానగర్‌లో రూ.42లక్షలతో చేపడుతున్న
షాదీఖానా భవనం, కృష్ణారెడ్డినగర్ కాలనీలో రూ.55లక్షలతో నిర్మిస్తున్న కల్వర్ట్ నిర్మాణం, లక్ష్మీనారాయణ కాలనీలో రూ.26.50 లక్షతో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను శంఖుస్థాపన చేశారు.
ఉప్పల్ నియోజకవర్గం సమాగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ టీకా రెండో డోసును రేవంత్‌రెడ్డి వేయించుకున్నారు. అక్కడి నుంచి రామంతాపూర్ గాంధీనగర్‌లోని సూపర్ స్ప్రెడర్లకు వేసే టీకా కేంద్రాన్ని పరిశీలించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: Wonder: చనిపోయిందనుకొని అంత్యక్రియలు.. కానీ అంతలోనే...!