మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. జవహర్ నగర్లోని డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ తెలిపారు. ప్రతి ఏటా ప్రభుత్వం 140 కోట్లు నిధులు కేటాయిస్తున్నా.. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతానని తెలిపారు.
ఓట్లేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేస్తానని, అధైర్య పడవద్దని రేవంత్ అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. భౌతికదూరం పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గాంధీ భవన్కు కరోనా ఎఫెక్ట్.. వారం పాటు మూసివేత