కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ.. 'భారత్ బచావో' పేరిట నేడు దిల్లీలోని రాంలీలా మైదానంలో జరుగుతున్న కాంగ్రెస్ ర్యాలీకి మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. భాజపా ప్రభుత్వ విభజనవాదం, విధ్వంసక వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకే ర్యాలీ చేపడుతున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రం నుంచి 4 వేల మంది నేతలు, కార్యకర్తలు దిల్లీ వెళ్లినట్లు పేర్కొన్నారు.
ఏ విషయాన్నైనా ట్విటర్లో స్పందించే ప్రధాని.. ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడరంటూ ప్రశ్నించారు. సీఎం నియంతృత్వ పాలనలో రాష్ట్రం బందీ అయ్యిందని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ దోపిడీ ఆపేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానంటూ బాకీల తెలంగాణగా మార్చారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండిః చీకట్లో డిగ్రీ దూర విద్య పరీక్షల మాస్‌కాపీయింగ్