ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఆరోవిడత హరితహారం కార్యక్రమంలో భాగంగా... ఈ నెల 25న పటాన్చెరు నుంచి మేడ్చల్ జిల్లా దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు మొక్కలు నాటనున్నారు. ఈ మధ్య ఉన్న రైల్వే కారిడార్ వెంబడి సుమారు 25 కిలోమీటర్ల వరకు మొక్కలు నాటే ప్రాంతాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
ఇదీ చూడండి: 'ఇకపై సొంతూళ్లకు సమీపంలోనే ఉపాధి'