ETV Bharat / state

'రంగారెడ్డి, మేడ్చల్​ను అభివృద్ధి చేద్దాం... రిపోర్టులు ఇవ్వండి'

రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాలను అభివృద్ధి చేసేలా... దానికి అవసరమైన ప్రణాళికను... ప్రతి నియోజకవర్గంపై ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని ఎమెల్యే వివేకానంద అధికారులకు సూచించారు. అతి త్వరలోనే మళ్లీ సమావేశం నిర్వహిస్తామని... అప్పటికి రిపోర్టులు సిద్ధంగా ఉండాలన్నారు.

mla vivekananda review meeting on medchal devlopments
'రంగారెడ్డి, మేడ్చల్​ను అభివృద్ధి చేద్దాం... రిపోర్టులు ఇవ్వండి'
author img

By

Published : Apr 6, 2021, 4:22 PM IST

హైదరాబాద్​కు ధీటుగా రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. దానికి అనుగుణంగా కార్యచరణకు సంబంధించి ప్రతి నియోజకవర్గంపై ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధం చేయాలని కేసీఆర్ సూచించినట్లు తెలిపారు.

ఈ అంశంపై కుత్బుల్లాపూర్​లోని జీబీఆర్​ కల్చరల్​లో అన్నిశాఖల అధికారులు, కార్పొరేటర్లు, ఛైర్మన్లతో ఎమ్మెల్యే వివేకానంద సమావేశమయ్యారు. స్థానికంగా ఉండే సమస్యలపై చర్చించి వాటి పరిష్కారాలకు దిశానిర్దేశం చేశారు. మౌళిక సదుపాయాలే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి శాఖతో అతి త్వరలోనే మళ్లీ సమావేశం నిర్వహిస్తామని... అప్పటికి రిపోర్టులు సిద్ధం చేయాలని వివేకానంద ఆదేశించారు.

ఇదీ చూడండి: 'ఉన్నత విద్యావంతులు వ్యవసాయంపై దృష్టి పెట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.