మేడ్చల్ జిల్లా సూరారం డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్లో ఇంటింటికీ తిరుగుతూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ధరణి పోర్టల్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. సీఎం ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టంతో కొన్ని దశాబ్దాలుగా పరిష్కారం నోచుకోని భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. పూర్తి పారదర్శకతతో ధరణి పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు.
అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు ఆన్లైన్ చేసుకోవాలన్నారు. ఈ పోర్టల్‌తో ఇకమీదట రిజిస్ట్రేషన్లు ఆవెంటే మ్యుటేషన్ల ప్రక్రియకు వెసులుబాటు ఉందని తెలిపారు. సర్వే వివరాల కోసం వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. ధరణి పోర్టల్‌పై ప్రజలకు ఎలాంటి అపోహలు వద్దని, ముఖ్యంగా ఎవ్వరూ దళారులను నమ్మవద్దని సూచించారు.
ఇదీ చూడండి: లక్ష్యం ప్రకారం సర్వేను పూర్తి చేయాలి: జీహెచ్ఎంసీ కమిషనర్