మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌లో పేద ప్రజలకు మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం మచ్చ బొల్లారంలోని ఏకలవ్య కాలనీలో పెద్ద ఎత్తున ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
మొక్కల పెంపకం వల్ల వాతావరణంలో ప్రాణవాయువు శాతం పెరిగి పర్యావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుందన్నారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని ఎమ్మెల్యే కోరారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి డివిజన్లో కరోనా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని.. వ్యాధి లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు