మేడ్చల్ జిల్లా జీడిమెట్ల డివిజన్ పరిధిలోని వేంకటేశ్వర కాలని ఈస్ట్‌లో నూతనంగా సీసీ కెమెరాలను ప్రారంభించారు. దాత కేఎం ప్రతాప్ ఆధ్వర్యంలో రూ.5 లక్షలతో 32 సీసీ కెమెరాలను బాలానగర్ జోన్ డీసీపీ పీవీ పద్మజ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. అనంతరం అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సాగించాలంటే శాంతి భద్రతలతో పాటు ప్రశాంత వాతావరణం కల్పించడం కీలకమని ఎమ్మెల్యే అన్నారు.
మహిళా భద్రత కోసం
ముఖ్యమంత్రి కేసీఆర్.. పోలీస్ విభాగానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తూ నిధులను సమకూర్చడంతోపాటు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఫలితంగా స్వల్పకాలంలోనే దేశంలోనే మెరుగైన అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత కల్పించడంతోపాటు మహిళా భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలను చాలా వరకు నివారించవచ్చని చెప్పారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే సుమారు 7 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే చెప్పారు. ఎవరైనా అపరిచితులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నిందితులను సులభంగా గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని డీసీపీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామంలో రైతులతో ముఖాముఖి'