ETV Bharat / state

వరదల సమయంలో హైదరాబాద్ గుర్తుకు రాలేదా? : సత్యవతి రాఠోడ్ - గ్రేటర్ ఎన్నికలు

ఎన్నికలు రాగానే భాజపా నాయకులకు హైదరాబాద్ ప్రజలు గుర్తుకు వచ్చారా అని మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలో ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ డివిజన్​లో ఆమె ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కావాలంటే తెరాసను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Minister satyavathi rathod election compaighn in ghmc in uppal
వరదల సమయంలో హైదరాబాద్ గుర్తుకు రాలేదా? : సత్యవతి రాఠోడ్
author img

By

Published : Nov 26, 2020, 6:59 PM IST

భాగ్యనగరం మరింత అభివృద్ధి చెందాలంటే గ్రేటర్ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలంటూ మంత్రి సత్యవతి రాఠోడ్ ఓటర్లను కోరారు. ఎన్నికలు రాగానే కేంద్రమంత్రులకు హైదరాబాద్ ప్రజలు గుర్తుకు వచ్చారా అని ఆమె ప్రశ్నించారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీహెచ్ఎంసీలోని ఉప్పల్​ నియోజకవర్గంలోని చిలుకానగర్ డివిజన్​లో తెరాస అభ్యర్థి గీత ప్రవీణ్​ ముదిరాజ్​ తరపున మంత్రి ఇంటింటా ప్రచారం చేపట్టారు. కేటీఆర్ రోడ్​షోను విజయవంతం చేసినందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. భాజపా నాయకులు మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో కుట్రలు చేయడం మానుకోవాలని సత్యవతి రాఠోడ్ హితవు పలికారు.

ఇదీ చూడండి:కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.