దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని మంత్రి సీహెచ్ మల్లారెడ్డి సూచించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.
గ్రామాల వారీగా వరి, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏ రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... పండించిన ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, హమాలీలు సామాజిక దూరం పాటించాలని మంత్రి సూచించారు.