ETV Bharat / state

మేడ్చల్​ జిల్లాలో వేలాది వలస కూలీల తరలింపు - మేడ్చల్​ జిల్లా తాజా వార్తలు

రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన వలస కూలీలు.. లాక్​డౌన్ కారణంగా స్వస్థలాలకు వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వారిని స్వస్థలాలకు తరలించేందుకు.. ప్రభుత్వం ఎన్జీవోలు కృషి చేస్తున్నాయని వెల్లడించారు. తాజాగా మేడ్చల్​ జిల్లా పరిధిలోని వేలాది వలస కూలీలను వారి సొంతూళ్లకు చేరవేస్తున్నట్లు పేర్కొన్నారు.

మేడ్చల్​ జిల్లాలో వేలాది వలస కూలీల తరలింపు

author img

By

Published : May 17, 2020, 11:58 PM IST

మేడ్చల్ జిల్లా పరిధిలోని వేలాది వలస కూలీలను వారి నివాసాలకు చేరవేసేందుకు ప్రభుత్వం, టీఎస్​ఐజీ (తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్) ఎన్జీవోలు కృషి చేస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఉత్తరభారతదేశంలోని రాష్ట్రాలైన బిహార్, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ మొదలైన రాష్ట్రాలకు ఎన్జీవో సహకారంతో ఏర్పాటు చేసిన బస్సులు, ప్రభుత్వం రైళ్లలో వలస కూలీలను తరలిస్తున్నామని పేర్కొన్నారు.

మేడ్చల్​ ప్రధాన జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీల నుంచి వివరాలు సేకరించి, వారి రాష్ట్రాలకు పంపిస్తున్నారు. అలాగే ఆహారం కూడా అందిస్తున్నారు. ఇవాళ మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జ్​ మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఇదీ చదవండి: వలస కూలీలను ఫోన్​ నంబర్​తో పట్టేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.