మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలం అలియాబాద్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో శనివారం పౌరహక్కుల దినోత్సవాన్ని వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమనికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో అందరూ సమానమేనని మంత్రి అన్నారు. చదువుకోవడం వల్ల సమాజంలో అసమానతలు తగ్గుతాయని తెలిపారు. అది రూపుమాపడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
పౌర హక్కుల దినోత్సవం జరుపుకోవడం, దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను దుర్వినియోగం చేయకుండా అధికారులు చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ జితేందర్, కలెక్టర్ ఎంవీ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెహ్నుర్ మహేశ్ ఏక్తా పాల్గొన్నారు.
ఇదీ చూడండి : సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణం : రేవంత్