మేడ్చల్ జిల్లాలోని శ్రీ రంగవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. లాక్డౌన్ నేపథ్యంలో కరోనా తగ్గుముఖం పట్టిందని ఆయన తెలిపారు. అలాగే గ్రామ గ్రామాన ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం మంచి పరిణామం అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందరికీ బెడ్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి కరోనా అంతమొందించడానికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ సభ్యురాలు శైలజ, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు విజయానంద రెడ్డి, తెరాస నాయకులు ఉన్నారు.
ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు