ETV Bharat / state

Malla reddy: కేసీఆర్​ చిత్రపటానికి మంత్రి పాలాభిషేకం.. ఎందుకంటే..? - బోడుప్పల్​లో మంత్రి మల్లారెడ్డి

బోడుప్పల్​, పీర్జాదిగూడ నగరపాలక సంస్థలకు నిధులు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్​ చిత్రపటానికి మంత్రి మల్లారెడ్డి పాలాభిషేకం చేశారు. వరద నీటి కాలువ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడంపై మంత్రి కేటీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బోడుప్పల్​లో రూ.2.16 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

Minister Malla reddy
సీఎం కేసీఆర్​ చిత్రపటానికి మంత్రి మల్లారెడ్డి పాలాభిషేకం
author img

By

Published : Nov 3, 2021, 4:20 PM IST

నగరపాలక సంస్థలో వరద నీటి కాలువ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ చొరవ చూపినందుకు మంత్రి మల్లారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మేడ్చల్ జిల్లాలోని పీర్జాదిగూడ, బోడుప్పల్ నగరపాలక సంస్థలకు రూ.కోటి 10 లక్షల నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి మంత్రి మల్లారెడ్డి, మేయర్లు జక్కా వెంకట్ రెడ్డి, బుచ్చిరెడ్డిలు క్షీరాభిషేకం చేశారు. అనంతరం బోడుప్పల్ లో రూ.2.16 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

గతంలో ఎన్నడు లేని భారీవర్షాలకు కాలనీలు వర్షపు నీటిలో మునిగిపోయాయని మంత్రి తెలిపారు. వర్షాకాలంలో అనేక కాలనీలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ స్వయంగా వచ్చి పరిస్థితిని సమీక్షించారని మంత్రి చెప్పారు. అభివృద్ధి పనుల్లో మేడ్చల్ నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేస్తున్నారని మంత్రి కొనియాడారు. నగర పాలక సంస్థలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని.. తన నియోజకవర్గంలో ఐటీ సంస్థలతో పాటు మరిన్ని వాణిజ్య సముదాయాలు రాబోతున్నాయని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.

పీర్జాదిగూడ, బోడుప్పల్ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. వర్షపు నీటితో చాలా ఇబ్బందులు పడ్డాం. వందేళ్లలో లేని భారీ వర్షానికి వరదనీటిలో కాలనీలు మునిగిపోయాయి. ఈ సమస్యను అధిగమించేందుకు రూ.కోటి 10 లక్షలు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​కు ధన్యవాదాలు. వర్షపు నీటితో ఏర్పడే ముంపు సమస్యను వచ్చే వర్షాకాలంలోపే పరిష్కరిస్తాం. మేయర్​ డీపీఆర్ రూపొందించి మంత్రి కేటీఆర్​కు ఇచ్చిండు. పనులు త్వరలోనే ప్రారంభిస్తాం. నిధులు విడుదల చేసినందుకు మరొక్కసారి కేసీఆర్​, కేటీఆర్​కు ధన్యవాదాలు. - మల్లారెడ్డి, రాష్ట్రమంత్రి

ఇదీ చూడండి:

Etela Rajender Speech: 'కేసీఆర్‌ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయమిది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.