దశలవారీగా డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రజలకు అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లో క్రీడా సముదాయం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను మంత్రి తలసానితో కలిసి ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌లో చాలా పనులు మిగిలి ఉన్నాయని, మున్ముందు పూర్తి చేస్తామని కేటీఆర్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గాన్ని మంత్రి తలసాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌పై గతంలో ఉన్న అనుమానాలను పటాపంచలు చేశామని.. రాష్ట్ర ఆదాయం పెంచాలి, పేదలకు పెంచాలనేది కేసీఆర్ లక్ష్యమని పునరుద్ఘాటించారు.
సనత్‌నగర్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని.. నగరానికి తలమానికంగా సనత్‌నగర్‌లో ఇండోర్ స్టేడియం నిర్మించామని మంత్రి తలసాని చెప్పారు. ఫతేనగర్ బ్రిడ్జి వైండేనింగ్ చేస్తున్నామని, నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని, వరదల సమయంలో ఏ పార్టీ కూడా బాధితులను అదుకోలేదని చెప్పారు.
వరద బాధితులకు ఆర్థికంగా సాయం అందించామని.. మిగిలిన వారికి రెండు రోజుల్లో అందిస్తామని తలసాని వెల్లడించారు. గతంలో అనేక సమస్యలే ఉండేవని, వాటిని పరిష్కరించామని.. పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
ఇదీ చూడండి: పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రజలదే: కేటీఆర్