లాక్డౌన్లో ఉపాధిలేక.. వలస వచ్చి చిక్కుకుపోయిన కూలీలను సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏర్పాటు చేసిన శ్రామిక రైళ్ల ద్వారా వీరిని గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. కూకట్పల్లి కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, ఒరిస్సా, జమ్ము కశ్మీర్ తదితర రాష్ట్రాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు.
ముందుగా పయనమయ్యే వారి పేర్లు నమోదు చేసుకుని రైలు ఏర్పాటును బట్టి వారి సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు పీఎస్ నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా రైల్వేస్టేషన్‌కు తరలించారు. ఇవాళ కూకట్పల్లి పీఎస్ నుంచి 200 మంది వలస కార్మికులు బయలుదేరి వెళ్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఊర్లకు వెళ్లకుండా నగరంలోనే ఉండి పనిచేసుకోవాలనుకునే వారికీ తోడ్పాటు అందిస్తామని పోలీసులు అన్నారు.
ఇదీ చదవండి: వలస కూలీలను ఫోన్ నంబర్‌తో పట్టేస్తారు