ETV Bharat / state

ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ - Distributed essentials to auto drivers

లాక్​డౌన్​తో అనేక ఇబ్బందులు పడుతోన్న నిరుపేదలకు సాయంగా నిలిచేందుకు మేడ్చల్ టీఆర్ఎస్​కేవీ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్​ ముందుకొచ్చారు. కష్ట కాలంలో ఉపాధి కరవైన ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

Distribution of essentials
Distribution of essentials
author img

By

Published : Jun 6, 2021, 7:47 PM IST

అసంఘటిత కార్మికుల కోసం సీఎం కేసీఆర్ అనునిత్యం కృషి చేస్తున్నారని మల్కాజిగిరి పార్లమెంటు తెరాస ఇంఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్​కేవీ అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో.. 200 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. పేద కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన టీఆర్ఎస్​కేవీ యూనియన్ నాయకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

తెరాస ప్రభుత్వం.. రోడ్డు పన్ను మాఫీ, ఉచిత ప్రమాద బీమా తదితర సౌకర్యాలను కల్పించి కార్మికులకు అండగా నిలిచిందని రాజశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్​ఎస్​కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Telangana Cabinet: ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.