ETV Bharat / state

'పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే రక్షణ సాధ్యం' - medchal malkajgiri

పోలీసులకు మాస్కులు, శానీటైజర్లతో కూడిన కిట్లను డీసీపీ రక్షిత మూర్తి అందించారు. లాక్​డౌన్​ సమయంలో ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు.

masks and sanitizers distributed to the police by the dcp rakshitha murty in medchal malkajgiri
'పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే రక్షణ సాధ్యం'
author img

By

Published : Apr 9, 2020, 12:18 PM IST

కరోనా వైరస్ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్​లోని సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లతో కూడిన కిట్లను మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి అందజేశారు. లాక్​డౌన్​ను సక్రమంగా అమలుజరగాలంటే పోలీసుల పాత్ర ముఖ్యమని.. కాబట్టి వాళ్ల ఆరోగ్యం బాగుండాలనే వారికి మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేస్తున్నానని ఆమె తెలిపారు. లాక్​డౌన్ ఉన్న అన్ని రోజుల్లో ప్రజలు రోడ్ల పైకి రావొద్దని.. విధుల్లో ఉన్న పోలీసులకు ఇబ్బంది కలిగించొద్దు కోరారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, కీసర సీఐ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: తగ్గుతున్న వాయుకాలుష్యం.. తేటపడుతున్న నగరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.