Mallareddy visited Dammaiguda girl family: మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో మృతిచెందిన బాలిక కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని.. మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు. బాలిక తల్లిదండ్రులను పరామర్శించిన మల్లారెడ్డి.. తక్షణ సాయం కింద రూ.1లక్షా 10 వేలు అందించారు. తాను ప్రత్యేకంగా సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఏరియా అభివృద్ధికి కృషి చేస్తానన్న మంత్రి.. సీపీతో మాట్లాడి గంజాయి లేకుండా నిర్మూలిస్తామని తెలిపారు. అంతకుముందు.. బాలిక అంత్యక్రియలు చేయాలని పోలీసుల సూచించగా.. ప్రభుత్వం నుంచి భరోసా వచ్చాకే మృతదేహం తీస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.
మంత్రి మల్లారెడ్డి బాధిత కుటుంబానికి భరోసాగా ఉంటుందని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఘటనకు సంబంధించి వేగంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో అంత్యక్రియలు జరిపేందుకు మృతురాలి కుటుంబసభ్యులు అంగీకరించారు. అంతిమయాత్రగా బాలిక మృతదేహాన్ని తీసుకువెళ్లి స్థానిక శ్మశానవాటికలో దహన సంస్కారాలు పూర్తి చేశారు. మరోవైపు పది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు రాచకొండ పోలీసులు వెల్లడించారు. త్వరలోనే దర్యాప్తు పూర్తి చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: