పేస్‌బుక్‌లో ఓ మైనర్ బాలికను పరిచయం చేసుకొని తీసుకెళ్తున్న ఓ యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో నివసించే మైనర్ బాలికకు ఫేస్బుక్ ద్వారా సిద్దిపేట జిల్లా కోమటి చెరువుకు చెందిన మహ్మద్ సాజిద్‌తో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ బాలిక వివరాలు సేకరించాడు.
రెండు రోజుల క్రితం బైక్‌పై వచ్చి ఇంట్లో ఎవ్వరూ లేనిసమయంలో వచ్చి బాలికను తీసుకెళ్లాడు. ఆ బాలిక మల్కాజిగిరి పోలీసులకు సమాచారం తెలిపింది. అప్రమత్తమైన పోలీసులు చేధించి నిందితుడు సాజిద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి : దారుణం: మొదటి రాత్రే భార్యను చంపేసిన భర్త!