మీడియాపై తనకు ఎటువంటి ద్వేషం లేదని... కొంతమంది మీడియాకు, తనకూ మధ్య గ్యాప్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని.. అందరిని ఒకేలా చూస్తానని కావాలని కొంతమంది తమ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేవలం దీనిని మాత్రమే తాను ఖండిస్తున్నానని తెలిపారు. వరద బాధితులను ఆదుకునే విషయంలో శక్తి వంచన లేకుండా రాత్రి పగలు తాను కష్టపడుతుంటే పనిగట్టుకుని నాపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
ప్రజలు ఆపదలో ఉన్నారని... ఈ సమయంలో ఎవరూ రాజకీయాలు చేయొద్దని వివిధ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని... దానికి బదులుగా తాను గట్టిగా కౌంటర్ ఇచ్చానే తప్ప తాను ఎవరిని దూషించలేదన్నారు. ఒకవేళ ఎవరి మనసైనా నొప్పించి ఉంటే క్షమించాలని మైనంపల్లి తెలియజేశారు. దీనికి ఇంతటితో ఫుల్స్టాప్ పెట్టాలని కార్యకర్తలకు, అభిమానులకు సూచించారు. తనకు మీడియాపై ఎటువంటి చెడు అభిప్రాయం లేదని... మీడియా సూచనలు తప్పకుండా తీసుకుంటానని తెలియజేశారు.
ఇవీ చూడండి: వరద విధ్వంసంపై మోదీ స్పందించకపోవడం బాధాకరం: తలసాని