ETV Bharat / state

ఆ లోక్​సభ స్థానం నుంచి గెలిస్తే - మంత్రి పదవి పక్కా!

Malkajgiri Lok Sabha Won Leaders as Minister : ఓ నియోజకవర్గంలో ఎన్నికైన అభ్యర్థి ఎమ్మెల్యేగా కాకుండా రాజకీయ వృత్తిలో ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నారు. ఆ నియోజకవర్గాన్ని రాజకీయ నాయకులు అదృష్టంగా భావిస్తున్నారు. దేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి లోక్​సభ స్థానంలో పోటీ చేస్తే అదృష్టం కలిసివస్తుందన్న సెంటిమెంట్‌ రాజకీయ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. ఇక్కడి నుంచి గెలిచిన ముగ్గురు నేతల ప్రస్థానం చూస్తే అది నిజమనిపించక మానదు. మరి ఆ నేతలెవరో ఓసారి చూద్దామా..?

Revanth Reddy Competed from Malkajgiri Lok Sabha Seat
Malkajgiri Lok Sabha Won Leaders as Minister
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2023, 11:33 AM IST

Malkajgiri Lok Sabha Won Leaders as Minister : రాష్ట్రంలో ఆ నియోజకవర్గంలో గెలుపొందిన అభ్యర్థులు రాజకీయంగా కలిసివస్తోంది. ఇప్పటివరకు ఆ స్థానం నుంచి పోటీ చేసిన నాయకుల్లో ముగ్గురు వ్యక్తులు విజయం సాధించారు. వారిలో ఒకరు రాష్ట్ర మంత్రి పదవిని చేపడితే, మరొకరు కేంద్ర మంత్రి హోదాలో పని చేశారు. ఇంకో అభ్యర్థి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నాయకులకు అదృష్టం కలిసివస్తోందన్న భావన అందరిలో ఏర్పడిపోయింది. అదే మల్కాజిగిరి లోక్​సభ నియోజకవర్గం.

'ప్రజల కోసం పనిజేసిన - నా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసిన - మళ్లీ గెలిపిస్తే ఇంకా చేస్తా'

Revanth Reddy From Malkajgiri Lok Sabha : లోక్​సభ నియోజకవర్గాల పునర్విభజన(Redistribution of Lok Sabha constituencies)లో భాగంగా 2009వ సంవత్సరంలో మల్కాజిగిరి లోక్​సభ నియోజకవర్గం(Malkajigiri Lok Sabha Constituency) ఏర్పాటైంది. ఈ స్థానం నుంచి మూడు ఎన్నికల్లో రికార్డులు సృష్టించింది. ఇక్కడి నుంచి గెలపొందిన నాయకులకు అదృష్టం కలిసి వస్తోందన్న సెంటిమెంట్​ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశంలో అతి పెద్ద నియోజకవర్గంగా పేరుగాంచిన మల్కాజిగిరి నియోజకవర్గంలో సర్వే సత్యనారాయణ, చామకూర మల్లారెడ్డి, రేవంత్​ రెడ్డి జరిగిన మూడు లోక్​సభ ఎన్నికల్లో గెలిచారు. తమ రాజకీయ జీవితంలో కీలక పదవులను అధిరోహించారు. మంత్రులు, ముఖ్యమంత్రి హోదాను పొందారు.

తెలంగాణ కొత్త సీఎం అనుముల రేవంత్‌ రెడ్డి - జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం సాగిందిలా

  • 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ పోటీచేసి విజయం సాధించారు. ఆ లోక్‌సభ నియోజకవర్గం రద్దు కావడంతో 2009లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 93 వేల మెజార్టీతో గెలిచారు. ఆ తరువాత 2012లో కేంద్ర రవాణాశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాజకీయ జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా చేశారు.
  • 2014లో తెలుగుదేశం పార్టీలో చేరిన చామకూర మల్లారెడ్డి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా తొలిసారిగా మల్కాజిగిరి నుంచే లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందారు. అప్పటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ మల్లారెడ్డినే. రాజకీయ సమీకరణాలతో ఆయన 2016లో బీఆర్ఎస్​లో తీర్థం పుచ్చుకున్నారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్​ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. 2023లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారు. తన రాజకీయ ఉన్నతికి మల్కాజిగిరి లోక్​సభ ఒక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు.
  • 2018లో శాసనసభ ఎన్నికల్లో కొడంగల్​ నుంచి రేవంత్​ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం 2019 ఏప్రిల్​లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఎంపీగా కొనసాగుతున్నప్పుడే రాష్ట్ర కాంగ్రెస్​లో​ కీలక బాధ్యతలు స్వీకరించారు. 2023లో జరిగి శాసనసభ ఎన్నికల్లో(Telangana Assembly Elections) కొడంగల్​, కామారెడ్డి పోటీ చేశారు. ఇందులో కొడంగల్​ నుంచి విజయం సాధించారు. సీఎల్పీ నాయకుడిగా ఎన్నికై ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు.

మల్కాజిగిరి నియోజకవర్గంపై ప్రధాన పార్టీల ఫోకస్ - ఎవరికీ రెండో ఛాన్స్ ఇవ్వని ప్రజలు - ఈసారి గెలుపు ఎవరిదో?

Minister Mallareddy Dance in Kukatpally : మరోసారి డ్యాన్స్ ఇరగదీసిన మంత్రి మల్లారెడ్డి.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.