హైదరాబాద్ ఉప్పల్‌లో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న చరవాణి దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం వెనుక ఉన్న గోడకు రంధ్రం చేసి లోపలకు ప్రవేశించి విలువైన ఫోన్లను ఎత్తుకెళ్లారు.
ఉదయం దుకాణం తెరిచిన నిర్వాహకులు దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించి, ఆధారాలు సేకరించారు. నిత్యం రాకపోకలతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం వల్ల వ్యాపారులు భయాందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి : ' ఆస్పత్రుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే... భూములు వెనక్కి తీసుకోండి'