ETV Bharat / state

మాస్కులు లేకుండా బయట తిరుగుతున్నవారికి జరిమానా - fine to people without mask in hyderabad

సికింద్రాబాద్​ అల్వాల్​ ప్రాంతంలో మాస్కులు లేకుండా తిరిగిన వారిపై మున్సిపల్​ ఉపకమిషనర్​ కఠిన చర్యలు తీసుకున్నారు. అల్వాల్​లో దుకాణాల వద్ద మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్నారనే సమాచారంతో తనిఖీ చేసిన అధికారులు... నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు.

lock-down-effect-on-states-income
మాస్కులు లేకుండా బయట తిరుగుతున్నవారికి జరిమానా
author img

By

Published : May 15, 2020, 12:34 PM IST

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్​ ధరించాలని అల్వాల్ మున్సిపల్ ఉపకమిషనర్​ తిప్పర్తి యాదయ్య తెలిపారు. అందులో భాగంగా మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు జీహెచ్​ఎంసీ అధికారులు జరిమానా విధించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులు కోరారు.

ఈ మేరకు ... అల్వాల్​లోని సూపర్​ మార్కెట్లు, కూరగాయల దుకాణాల వద్ద మాస్కులు లేకుండా తిరుగుతున్నారని అధికారులకు సమాచారం వచ్చింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అలాంటి వారిని గుర్తించి వారికి జరిమానా విధించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు అల్వాల్ మున్సిపల్ ఉపకమిషనర్​ స్పష్టం చేశారు..

ఇవీ చూడండి: తడిసిన నయనం.. ఆగని పయనం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.