ETV Bharat / state

పెండింగ్​ పనులు త్వరగా పూర్తి చేయాలన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు - కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

kukatpally MLA visit development works కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పలు అభవృద్ధి పనులను పరిశీలించారు. నియోజకవర్గంలోని బాలాజీనగర్ డివిజన్​లో పర్యటించిన పెండింగ్​లో ఉన్న వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డివిజన్​లో సమస్యలపై ఆరా తీశారు.

kukatpally MLA
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
author img

By

Published : Aug 28, 2022, 1:45 PM IST

kukatpally MLA visit development works నియోజకవర్గంలో పెండింగ్​ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బాలాజీనగర్​ డివిజన్​లో పర్యటించిన జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షటిల్​ కోర్టును పరిశీలించారు. కేవలం డివిజన్​ వాసులకే నామమాత్రపు రుసుముతో కేటాయించాలని ఎమ్మెల్యే సూచించారు.

అనంతరం కేపీహెచ్​బీ ఫోర్త్​ ఫేజ్​లో మల్టీపర్పస్ ఫంక్షన్​ హాల్​ను పరిశీలించారు. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఆరోఫేజ్​లోని బతుకమ్మ కుంట పనులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. పీవీ నరసింహారావు పార్కులోని ఓపెన్ జిమ్​ను ప్రారంభించారు

అనంతరం ఆరో ఫేజ్​ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన అన్ని విభాగాల అధికారులతో ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. కేపీహెచ్​బీ డివిజన్ అసోసియేషన్ అందరి సభ్యులందరితో అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా డివిజన్​లో జరుగుతున్న అభివృద్ధిని వారికి వివరించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలియపరచాలని అసోసియేషన్ సభ్యులను ఆయన కోరారు. దీంతో వారికి ఉన్న సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు.

ఇప్పటికే కేపీహెచ్​బీ డివిజన్​లో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఫ్లై ఓవర్లు, అండర్​పాస్​ బ్రిడ్జిలు, పార్కులు మంచినీటి నూతన పైప్ లైన్లతో డివిజన్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అక్కడక్కడ ఉన్న పెండింగ్ పనులు త్వరలో పూర్తి చేసి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, పగుడాల శిరీష బాబురావు, కోఆర్డినేటర్ సతీష్ అరోరా, జోనల్ కమిషనర్ మమత, డీసీ రవికుమార్, సీఐ కిషన్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: ఎగువ నుంచి పోటెత్తుతోన్న వరద, నిండుకుండల్లా జలాశయాలు

వరదలో కొట్టుకుపోయిన లారీ, మూడు టన్నుల సిమెంట్ గంగపాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.