జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు ఖాయమని కూకట్పల్లి డివిజన్ తెరాస అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. డివిజన్లో ఇంటింటి ప్రచారం చేశారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెప్పారు.
కాలనీల్లో ప్రజలు తమకే మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. డివిజన్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదన్నారు.
ఇదీ చదవండి: ప్రజా వ్యతిరేక విధానాలే అస్త్రాలుగా గ్రేటర్లో కాంగ్రెస్ ప్రచారం