ETV Bharat / state

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి - పీర్జాదిగూడలో మంత్రి మల్లారెడ్డి లేటెస్ట్​ వార్తలు

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపాలిటీకి చెందిన 62 మంది లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి.. మేయర్​ జక్కా వెంకట్​రెడ్డితో కలిసి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

kalyan laxmi and shaadi mubarak cheque distribution by minister mallareddy at peerzadiguda
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి
author img

By

Published : Sep 28, 2020, 5:43 PM IST

కేసీఆర్​ ప్రభుత్వం చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ పథకాలు.. పేదింటి ఆడబిడ్డలకు వరమని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కులను 62 మంది లబ్ధిదారులకు మేయర్​ జక్కా వెంకట్​రెడ్డితో కలిసి ఆయన అందజేశారు.

పేదింట్లో పెళ్లికి ఆర్థికంగా ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి వెల్లడించారు. అనంతరం మున్సిపాలిటీకి చెందిన పారిశుద్ధ్య వాహనాలను(ఆటోలు), వీధి కుక్కల నియంత్రణ కేంద్రం, సీసీ రోడ్డు పనులు, పార్కును మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.

ఇదీ చదవండిః ఎల్ఆర్ఎస్​ని సద్వినియోగం చేసుకునేలా చూడాలి: మల్లారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.