ETV Bharat / state

తాళం పగలగొట్టి సొత్తు ఎత్తుకెళ్లిన కేడీగాళ్లు - chory

ఇంటి తాళం పగలగొట్టి 11 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లిన ఘటన కీసర ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.

తాళం పగలగొట్టి సొత్తు ఎత్తుకెళ్లిన కేడీగాళ్లు
author img

By

Published : Jun 3, 2019, 11:05 AM IST

కీసర పోలీస్​స్టేషన్​ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. తాళంవేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడి సొత్తు ఎత్తుకెళ్లారు. నాగారం సాయిధరణి కాలనీకి చెందిన ప్రసాద్​ నిన్నరాత్రి సమయంలో కుటుంబసభ్యులతో సహా చార్మినార్​వద్ద షాపింగ్​కు వెళ్లాడు. తెల్లవారుజామున ఇంటికొచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉంది. లోపలకు వెళ్లిచూడగా సుమారు లక్షా పదివేల నగదు, 11 తులాల బంగారు నగలు, ఓ చరవాణి ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు, డాగ్​స్వాడ్​ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాళం పగలగొట్టి సొత్తు ఎత్తుకెళ్లిన కేడీగాళ్లు

ఇదీ చదవండి: పేకాట క్లబ్​లపై ఏకకాలంలో దాడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.