ETV Bharat / state

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్ష ప్రారంభం

జేఈఈ మెయిన్ పరీక్షలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే విద్యార్థులను లోనికి అనుమతిస్తున్నారు. కొవిడ్​ లక్షణాలు ఉన్నవారి కోసం అధికారులు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు.

jee-mains-exams-start-in-all-over-india
దేశవ్యాప్తంగా ప్రారంభమైన జేఈఈ మెయిన్ పరీక్షలు
author img

By

Published : Sep 1, 2020, 9:01 AM IST

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్​ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నుంచి 82 వేల 748 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈనెల 6వ తేదీ వరకు ఆన్​లైన్​లో ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. తొలిరోజు ఆర్కిటెక్చర్, ప్లానింగ్ పరీక్ష ఉండగా రెండోతేదీ నుంచి బీటెక్​, బీఈ పరీక్ష ఉంటుంది.

కొవిడ్​ లక్షణాలు ఉన్నవారి కోసం అధికారులు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. పీపీఈ కిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే విద్యార్థులందరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. విద్యార్థులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా పలు నిబంధలను అమలు చేస్తున్నారు.

మేడ్చల్ జిల్లా నాచారంలోని అయాన్ డిజిటల్​లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఉదయం 6 గంటల నుంచే ఇక్కడికి చేరుకున్నారు. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి లోనికి అనుమతిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.