ETV Bharat / state

సహాయక చర్యల్లో అధికారులు.. పని కానిచ్చేస్తున్న కబ్జాదారులు - సహాయక చర్యల్లో అధికారులు

భారీవర్షాలతో అతలాకుతలమవుతున్న బాధితులకు సహాయక చర్యలు అందించే పనిలో అధికార యంత్రాంగం తల మునకలై ఉంటే.. కబ్జాదారులు మాత్రం అర్ధరాత్రి సమయంలో యథేచ్చగా.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసే పనిలో నిమగ్నమయ్యారు. మేడ్చల్​ జిల్లా గాజుల  రామరంలో ప్రభుత్వ భూముల్లో జేసీబీలతో చదును చేసి.. బేస్​మెంట్​లు నిర్మించారు.

Illegal Occupiers Starts Constructions in Government Land
సహాయక చర్యల్లో అధికారులు.. పని కానిచ్చేస్తున్న కబ్జాదారులు
author img

By

Published : Oct 19, 2020, 6:26 PM IST

ఒకవైపు భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రమంతా అల్లకల్లోలమవుతోంది. ప్రజలు వరదలకు సర్వం కోల్పోయి బాధితులుగా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారికి చేయూతనందించేందుకు ప్రభుత్వాధికారులు సహాయక చర్యల్లో తలమునకలై ఉన్నారు. అయితే.. కబ్జాకోరులు మాత్రం ఇదే అదునుగా.. రాత్రికి రాత్రే.. ప్రభుత్వ భూములను జేసీబీలతో చదును చేసి.. నిర్మాణాలు చేపడుతున్నారు.

మేడ్చల్​ జిల్లా గాజులరామారంలో గల సర్వే నెంబర్ 342 కైసర్ నగర్ రాజన్నబస్తీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే కబ్జాదారులు అక్రమంగా తొమ్మిది బేస్​మెంట్​లు నిర్మించారు. స్థానికులను బెదిరిరస్తూ.. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టారు. రౌడీల పహారాలో ఆదివారం రాత్రి నిర్మాణాలు చేపట్టినట్డు సిసి కెమెరా రికార్డుల్లో కబ్జాదారుల ఆక్రమణలు స్పష్టంగా తెలుస్తుంది.. రెవెన్యూ అధికారులు స్పందించి.. అక్రమార్కులు నిర్మించిన తొమ్మిది బెస్​మెంట్​లను కూల్చేసినట్లు కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: శ్రీ భద్రకాళి ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.