మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఆనంద్ బాగ్‌లోని బండ చెరువు కింద ఉన్న ఎఫ్టీఎల్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే ఫిర్యాదు మేరకు సర్వేకి వెళ్లిన అధికారులపై ఓ వ్యక్తి దాడి చేశాడు. అక్కడ నిర్మాణాలు చేపడుతున్న యజమాని అల్లుడైన శ్రీహరి సర్వేకు వెళ్లిన అధికారులతో గొడవకు దిగాడు.
ఆవేశంతో కర్రతో ప్రభుత్వ ఉద్యోగి, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ వేంద వెంకట శ్రీనివాస్ రావు తలపై కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంజినీర్‌కు తీవ్ర రక్తస్రావం జరగడం వల్ల హాస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండి: జీవనశైలిలో మార్పులు తెచ్చిన కరోనా